- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. లేకపోతే : సంచైత
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేస్తుంది. ఓవైపు ఫొన్ ట్యాపింగ్ రగడ నడుస్తుండగానే.. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలకు సంబంధించి గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు పలు విమర్శలు చేశారు. దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్‌పర్సన్ సంచయిత గజపతి శుక్రవారం తీవ్రస్థాయిలో స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
సంచైత వ్యాఖ్యల్లో.. చంద్రబాబు గారూ, మీరు చేసిన ట్వీట్ నిస్సిగ్గుగా చేసిన దాడి అంటూ పేర్కొన్నారు. మాన్సాస్‌లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించాలనుకోవడం బాధ్యతా రాహిత్యం అని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించినట్టు ఈవో, కరస్పాండెంట్లు వివరించారని, అయినా, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని సంచైత గజపతి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.