తెల్లకోతితో పోల్చారంటూ హీరోయిన్ ఆవేదన

by Shyam |
తెల్లకోతితో పోల్చారంటూ హీరోయిన్ ఆవేదన
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ లేడి సానయా ఇరానీ ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ (చూపులు కలిసిన శుభవేళ)’ సీరియల్‌తో ఫేమ్ సంపాదించింది. ఈ ప్రాజెక్ట్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన భామ.. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కామెంట్స్ గురించి వివరించింది. ఊటీలోని బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఏం చేసినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయేదాన్నని తెలిపింది. తన స్నేహితుల కన్నా 10 టైమ్స్ ఫెయిర్‌గా ఉండటమే ఇందుకు కారణం కాగా.. అందరూ తనను తెల్ల బల్లి, బొద్దింకతో పోల్చేవారని చెప్పింది. తన ముక్కు, చెంపలు రెడ్‌గా ఉండేవని, ఇక తనను చూసిన ఓ గుజరాత్ ఫ్యామిలీ తెల్లకోతిలా ఉందని కామెంట్ చేశారని తెలిపింది. అయితే వారు తనకు గుజరాతీ రాదని, ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడుకున్నారని.. తనకు పూర్తి గుజరాతీ వచ్చన్న సంగతి వారికి తెలియదని చెప్పింది సానయ.

Advertisement

Next Story