కరోనాతో సమ్మక్క, సారలమ్మ పూజారి మృతి

by Sumithra |   ( Updated:2021-05-27 05:29:49.0  )
కరోనాతో సమ్మక్క, సారలమ్మ పూజారి మృతి
X

దిశ, మంగపేట : మేడారం వనదేవతలు శ్రీ సమ్మక్క, సారలమ్మలను నిత్యం పూజించే అర్చకులు సిద్దబోయిన సమ్మారావు(47) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. నెల రోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో హోంక్వారంటైన్‌లో ఉండి కోలుకున్న ఆయన ఇటీవల తీవ్రమైన అనారోగ్య సమస్యతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

నాటి నుంచి వైద్యం తీసుకుంటున్న సమ్మారావు గురువారం తుదిశ్వాస విడిచారు. ఇదిలాఉండగా, కొద్ది రోజుల కిందట సమ్మారావు భార్య సృజన కూడా కరోనా సోకి మృతి చెందింది. ఈ ఘటనతో మేడారంలోని ఆయన ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story