- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2022లో మళ్లొస్తాం..
by Shamantha N |
X
తెలంగాణ కుంభమేళా అయిన మేడారం జాతర ప్రశాంతంగా ముగిసింది. శనివారం సాయంకాలం గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మలిద్దరూ డప్పు వాయిద్యాలు, శివసత్తుల విన్యాసాలు, భారీ భద్రత నడుమ వనప్రవేశం చేశారు. మళ్లొచ్చే 2022 సంవత్సరంలో దర్శనమిస్తామంటూ భక్తులకు వీడ్కొలు పలికారు. రెండెండ్లకొకసరి వచ్చే దేవతలను కడసరిగా చూసుకుందామని చాలా మంది భక్తులు శనివారం కూడా క్యూలైన్లలో ఎదురుచూశారు. ఈ ఏడు జాతర సమయంలో కోటిన్నర జనాభా మేడారాన్ని సందర్శించి, అమ్మవార్లకు మొక్కులు సమర్పించినట్టు తెలుస్తోంది. వనప్రవేశం అనంతరం జనసందోహం కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇదిలాఉండగా మేడారంలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. సాయంకాలం నాటికి కుండపోత వర్షం కురవడంతో తడుస్తూనే భక్తులు దేవతలను దర్శించుకున్నారు.
Advertisement
Next Story