సమీరా .. నీ క్లారిటీ 'అదిరింది'

by Shyam |   ( Updated:2020-03-03 06:49:05.0  )
సమీరా .. నీ క్లారిటీ అదిరింది
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జబర్ధస్త్’ జడ్జ్ నాగబాబు సరికొత్త షో ‘అదిరింది’. జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చేసిన ఆయన ‘అదిరింది’ షోతో అదరగొట్టేస్తున్నారు. అయితే 10 ఎపిసోడ్స్ పూర్యయ్యాయో లేదో యాంకర్ సమీరాను పక్కన పెట్టేశారు. తన ప్లేస్‌లో భాను, రవిలు యాంకరింగ్ చేస్తున్నారు. దీంతో సమీరాను ఎందుకు పక్కన పెట్టేశారు? అనే దానిపై ప్రశ్నలు మొదలయ్యాయి. అందుకే దీనిపై క్లారిటీ ఇచ్చింది సమీరా.

‘అదిరింది’ షో నుంచి తప్పుకోవడానికి నిజానికి కారణం ఏమీ లేదని తెలిపింది. ప్రొడక్షన్ హౌజ్, ఛానల్ నిర్ణయానికి కట్టుబడే ఆ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపింది. వాళ్లు కూడా నాకు సరైన కారణం చెప్పలేదన్న సమీరా.. నిజానికి ఈ న్యూస్ నేను మీడియా ద్వారే ముందుగా తెలుసుకున్నానంది. తర్వాతే కన్ఫార్మేషన్ కోసం ఛానల్‌కు కాల్ చేసి కనుక్కున్నానని చెప్పింది. అయితే కారణం ఏదైనా షోకి మంచి జరగాలి అనుకున్నప్పుడు నన్ను పక్కన పెట్టినా .. పాజిటివ్‌గానే తీసుకుంటానని తెలిపింది సమీరా. నేను కూడా 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని ఆ మాత్రం అర్ధం చేసుకోగలను అని చెప్పింది. సీరియళ్ల ద్వారా ఏడుస్తూ కనిపించే నేను.. అదిరింది షో ద్వారా నవ్వుతూ కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారంది. అదిరింది షో ఎంచుకుని నేను తప్పు చేశానని ఎప్పుడూ ఫీలవ్వనని.. ‘అదిరింది’ మరింత అదిరిపోవాలనే కోరుకుంటానని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

View this post on Instagram

Here’s the real reason behind it. Talking about the rumours.

A post shared by Sameera Sherief (@sameerasherief) on

Advertisement

Next Story