సమంత బోల్డ్ రోల్.. ఓ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ : రాజ్ & డీకే

by Jakkula Samataha |
సమంత బోల్డ్ రోల్.. ఓ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ : రాజ్ & డీకే
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. తనకు హిందీలో ఇదే డెబ్యూ సిరీస్‌ కాగా, బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది సామ్. ఇక జూన్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. మేకర్స్ రాజ్ & డీకే ప్రమోషన్స్‌కు సంబంధించి స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే సీజన్ 2లో సమంత పోషించిన బోల్డ్ రోల్ గురించి రివీల్ చేసిన మేకర్స్.. సిరీస్‌పై ఎగ్జైట్‌మెంట్ పెంచే ప్రయత్నం చేశారు. సిరీస్‌లో సామ్ పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరిని షాక్ గురిచేస్తుందని తెలిపారు. అయితే సీజన్ 2 మొదలుపెట్టే ముందు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్‌కు తను ఒప్పుకుంటుందా? లేదా? అనే డౌట్ పడ్డామని, కానీ అలా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ కోసం సమంత కూడా సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉందని వెల్లడించారు.

అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. సామ్ రెండు బిగ్ సౌత్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అందులో ఒకటి విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో నయనతార, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ పోషిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ కాగా, మరొకటి తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాలో సమంత లీడ్ రోల్ ప్లే చేస్తుండటం విశేషం.

Advertisement

Next Story