‘ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం వెయిటింగ్!

by Jakkula Samataha |   ( Updated:2020-08-29 05:13:42.0  )
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం వెయిటింగ్!
X

దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన అక్కినేని కోడలు.. టాటూ, ప్రెగ్నెన్సీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంట్రీతో పాటు తను ప్రస్తుతం చేస్తున్న గార్డెనింగ్ అండ్ ఫామింగ్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది.

ప్రశ్న: చైతు, మీరు వేయించుకున్న టాటూకు అర్థం ఏంటి?

సామ్ : మీ సొంత ప్రపంచాన్ని సృష్టించుకోండి.. ఆ బంధంమే మిమ్మల్ని కలుపుతుంది.

ప్రశ్న: కుకింగ్ లేదా వ్యవసాయం.. రెండింటిలో ఏది ఇష్టం?

సామ్: ఇప్పుడైతే వ్యవసాయం

ప్రశ్న: మీరు ప్రెగ్నెంటా?

సామ్: హా.. 2017 నుంచి ప్రెగ్నెంట్ అనుకుంటా.. కానీ బేబీ నిజంగా బయటకు రావాలని కోరుకోవడం లేదు.

ప్రశ్న: శాకాహారిగా మారడం సులభమేనా?

సామ్: అనుకుంటే సులభమే.. కానీ వెజిటేరియన్ జర్నీని ప్రతీ సెకన్ చాలా ఎంజాయ్ చేస్తున్నా.

ప్రశ్న: మాకు కూడా ఒక కిలో క్యారెట్ పంపిస్తారా?

సామ్: క్యారెట్ పచ్చడి, క్యారెట్ ఇడ్లీ అన్ని చేశాను. కాబట్టి ఇప్పుడు క్యారెట్ అయిపోయింది, నెక్స్ట్ టైమ్ పంపిస్తాను.

ప్రశ్న: ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ఎప్పుడు రాబోతుంది?

సామ్: నేను కూడా దీని కోసం చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. ఈ మధ్యే డబ్బింగ్ కూడా పూర్తి చేశా. కిక్కాస్‌గా ఉంది.

ప్రశ్న: లాక్‌డౌన్‌లో మీరు చేసిన మంచి పని?

సామ్: ఈ లాక్‌డౌన్‌లో ఒక స్పెషల్ వర్క్ చేశా.. త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను.

ప్రశ్న: మీ ఫిట్‌‌నెస్ సీక్రెట్స్?

సామ్: ఫిట్‌గా ఉండాలని ఎక్కువగా డైట్ మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల మైండ్‌లో ఎఫ్పుడూ ఫుడ్ గురించే ఆలోచిస్తుంటాం. అందుకే నేనెప్పుడూ డైట్ ఫాలో అవను, నచ్చింది తినేస్తా.

Advertisement

Next Story

Most Viewed