అతనితో కలసి సామ్ ఫారెన్ ప్రయాణం.. ఎందుకో తెలుసా ?

by Anukaran |
అతనితో కలసి సామ్ ఫారెన్ ప్రయాణం.. ఎందుకో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఫుల్ చిల్ అవుతోన్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజుల నుంచి సమంత రొటీన్ లైఫ్‌లోకి వచ్చింది. దాదాపు నాలుగైదు రోజులు ఈ లోకంలోనే లేనట్టుగా ఎంతో సంతోషంగా తన స్నేహితులతో తీర్థయాత్రలు చేసింది. హిమాలయాల్లో తిరుగుతూ, దైవ దర్శనం చేసుకుంటూ.. తన మనసును కాస్త ప్రశాంతపర్చుకున్నట్టు కనిపిస్తోంది సమంత. అయితే తాజాగా సమంత చేసిన మరో పోస్టు వైరల్ అవుతోంది. తన స్టైలిష్ ప్రీతమ్ జుల్కర్‌, మరో స్నేహితురాలితో కలసి ఫారెన్ వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సామ్. ఈ ఫోటోలో స‌మంత రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్‌లో ఉన్నట్టు క‌నిపిస్తోంది. దీని బట్టి చూస్తే అన్నీ మర్చిపోవడానికే ఇలా ప్రయాణాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన రూమర్స్ అన్నింటినీ వదిలేసి తన స్నేహితులతో హాయిగా గడుపుతూ.. రోటిన్ లైఫ్‌ను స్టార్ట్ చేసి, సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయితే విడాకుల సమయంలో సామ్‌, ప్రీతమ్ రిలేషన్‌పై చాలా రూమర్స్ వచ్చాయి, అవన్నీ కొట్టిపడేస్తూ ప్రీతమ్ సామ్ అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story