ఆ ముగ్గురితో.. సమంత

by Shyam |   ( Updated:2020-12-14 08:37:03.0  )
ఆ ముగ్గురితో.. సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ లిక్కర్ కంపెనీ రాయల్ స్టాగ్ చాలా కాలం నుంచి ‘రాయల్ స్టాగ్ బ్యారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిలిమ్స్’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా పలు లఘుచిత్రాలను తీస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకులు ఇంతియాజ్ అలీ, నిరంజన్ అయ్యంగర్, నీనా కులకర్ణి, మనీష్ రహత్‌కర్, టిస్కా చోప్రాలు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించగా, ఆ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ యూట్యూబ్ చానల్.. ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అనే టాపిక్ మీద ప్రముఖ నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, మనోజ్ బాజ్‌పాయ్, సైఫ్ అలీ ఖాన్, టిస్కా చోప్రా, సమంతతో ఓ కార్యక్రమం రూపొందించింది. కాగా ఈ డిస్కషన్ జీ నెట్‌వర్క్‌లో డిసెంబర్ 19న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమంత తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. ‘బ్రిలియంట్ పీపుల్స్‌తో కలిసి సినిమా గురించి చర్చించడం నిజంగా అద్భుతం. ఇది నాకెంతో ప్రత్యేకం’ అని సైఫ్, నవాజుద్దీన్, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి దిగిన ఫొటోను ఈ కామెంట్‌గా జత చేసి తన అభిమానులతో షేర్ చేసుకుంది సామ్.

సమంత ప్రస్తుతం ఆహా ఓటీటీలో ‘సామ్ జామ్’ పేరుతో వస్తోన్న టాక్ షోలో టాలీవుడ్ ప్రముఖులను తనదైన స్టైల్‌లో ఇంటర్వూ చేస్తుండగా, రాబోయే ప్రాజెక్ట్స్ గురించి సామ్ ఇంతవరకు రివీల్ చేయలేదు.

Advertisement

Next Story