కౌన్సిలింగ్ స్టేజ్ లో సమంత- చైతన్య డైవోర్స్.. బ్రేకప్ స్టోరీ వైరల్

by Anukaran |   ( Updated:2021-09-09 23:05:01.0  )
కౌన్సిలింగ్ స్టేజ్ లో సమంత- చైతన్య  డైవోర్స్.. బ్రేకప్ స్టోరీ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పకపోవడంతో అనేక అనుమానాలు అభిమానులను చుట్టుముట్టాయి. అసలు నిజంగా ఈ జంట విడాకులు తీసుకోనుందా..? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సామ్- చై విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం అది ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉందని వినికిడి. దీని కోసమే టూర్ లో ఉన్న సమంత ఓ రోజు హైదరాబాద్ కి కూడా వచ్చి వెళ్ళిందట. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య విభేదాలకు కారణం ఏంటి..? అంటే.. సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే చై ని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఆ తరువాత కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ చాలా సెలక్టీవ్ గా సినిమాలను ఎంచుకొని విజయాలను అందుకుంది.

Samantha Akkineni: Nagarjuna is a bible on how you should live your life | Entertainment News,The Indian Express

పెళ్లి తర్వాత కూడా అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదే చైతూతో విడిపోవడానికి కారణమని తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో హీరోయిన్లు పెళ్లి తరువాత సినిమాలలో నటించడం అనేది చాలా తక్కువ. నాగ్ భార్య అమల కూడా పెళ్లి తరువాత సినిమాలలో నటించింది లేదు. ఎప్పుడు ఫ్యామిలీని అంటిపెట్టుకొని కుటుంబ బాధ్యతలకే పరిమితమైపోయింది. అమలలానే సామ్ కూడా ఇంటికే పరిమితమవ్వాలని అక్కినేని ఫ్యామిలీ అన్నట్లు, అందుకు సామ్ అంగీకరించనట్లు సమాచారం. సమంత ఫ్యామిలీ ఉమెన్ గా ఉండకుండా ఫుల్ బిజీగా ఉంటూ ఫ్యామిలీకి దూరం అవుతుండడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చడం లేదని, ఈ విషయమై చై, సామ్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. సమంతకు ఇరు కుటుంబాలు చేసిన హిత బోధ కూడా వర్కవుట్ కాలేదట. దాంతో విడాకులకు అప్లై చేయటం. అది కౌన్సిలింగ్ వరకూ వెళ్ళటం జరిగిందంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా అమ్మడు విడిపోయినట్లు ఇన్ డైరెక్ట్ గా హింట్లు ఇస్తోంది.

ಡಿವೋರ್ಸ್ ವದಂತಿ ಮಧ್ಯೆಯೇ ಹಾಟ್ ಫೋಟೋಶೂಟ್​ನಲ್ಲಿ ಮಿಂಚಿದ ಸಮಂತಾ | Samantha Akkineni Hot Photoshoot goes viral Amid Divorce news | TV9 Kannada

సోషల్ మీడియాలో అత్తవారింటి పేరు అక్కినేనిని తొలగించడం, మామ నాగ్ బర్త్ డే కి అటెండ్ కాకపోవడం, విడాకులపై స్పందించకపోవడం, పెళ్లి కాకముందు చేసిన ఎక్స్ పోజింగ్ మళ్లీ చేయడం.. అన్నింటికి మించి సినిమాలకు కాస్త విరామం ఇస్తున్నానని చెప్పడం.. ఇలాంటివన్ని సామ్, చై నుంచి విడిపోవడం నిజమే అని తెలిసేలా చేస్తున్నాయి. ఇక తాజాగా సమంత తన ఇన్స్టాలో పెట్టిన బ్రేకప్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.

‘ది మోడ్రన్ బ్రేకప్’ అనే పేజీలోని ‘ఇది నన్ను బాధిస్తోంది’ అనే బ్రేకప్ పోస్ట్ ని షేర్ చేసి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ”మీ చుట్టూ ఉన్నవారిపై మీరు చూపే నిజమైన ప్రభావం మీకు ఎప్పటికీ తెలియదు. ఆ చిరునవ్వు ఎవరికి ఎంత అవసరమో మీకు తెలియదు.. ” అంటూ సాగిన ఈ స్టోరీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి వీటన్నింటికి ఈ జంట ఎప్పుడు ఫుల్ స్టాఫ్ పెడుతుందో చూడాలి.

Advertisement

Next Story