అవును.. నేను ఆ హీరోయిన్ ని కాపీ కొడతాను- సమంత

by Shyam |   ( Updated:2021-06-11 01:54:06.0  )
samantha news
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు స్ఫూర్తి ఉంటారు. వారి జీవితాన్నే ఉదాహరణగా తీసుకొని వీరు ఎదుగుతారు. అది నటన విషయంలోనైనా, ఫ్యాషన్ విషయంలోనైనా ఆ స్ఫూర్తి ఇచ్చినవారినే ఫాలో అవుతారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ లో ఫ్యాషన్ ఐకాన్ ఎవరు అంటే సమంత అని టక్కున చెప్పేస్తారు. ఎప్పుడు ట్రెండీ లుక్ ని సెట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్న సామ్ కి స్ఫూర్తి ఎవరు? ఎవరి ఫ్యాషన్ ని ఆమె ఫాలో అవుతుంది? అంటే.. సామ్ బాలీవుడ్ నటి దీపికా ఫాలోవర్ అని తెలిసింది. ఆ విషయాన్ని ఆమె నిర్మొహమాటంగా చెప్పింది కూడా.. ఇటీవల బాలీవుడ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సామ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

samantha news

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే టాప్ మోడల్ గా, నటిగా ఒక యూనిక్ స్టైల్ ని మైంటైన్ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. ఆమె ఎక్కడికి వెళ్లిన తన ఫ్యాషన్ తోనే అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఆ ఫ్యాషనే తనకు నచ్చిందని, దీపిక సుదీర్ఘ అనుభవం తనదైన యూనిక్ స్టైలింగ్ ప్రతిసారీ సమంత మనసు దోచేశాయని నిజాయితీగా తెలిపారు. ఫ్యాషన్ లో నేను దీపికానే ఫాలో అవుతానని చెప్పుకొచ్చింది. చాలాసార్లు సామ్, దీపికా లుక్ ని కాపీ చేసింది అనే వార్తలు వస్తున్నప్పుడు తనేం బాధపడలేదని, తనకు దీపికా అంటే చాలా ఇష్టమని, ఆమె డ్రస్సింగ్ స్టైల్ బాగా నచ్చడంతో తనలా ఉండడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

samantha news

తనకు దీపికా పదుకొనేను కాపీ కొట్టడం తనకు ఇష్టమని ఒప్పుకున్న సామ్ దీపిక అసలు మానవ రూపంలో ఉన్న దేవతనా? అని అనిపించేదని తెలిపింది.ఇకపోతే ప్రస్తుతం సామ్ నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ విజయవంతంగా దూసుకెళ్తోంది.

Advertisement

Next Story