కాబోయే పార్ట్‌నర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సామ్..

by Shyam |   ( Updated:2021-12-02 05:26:25.0  )
కాబోయే పార్ట్‌నర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సామ్..
X

దిశ, సినిమా: ప్రముఖ గాయని బ్రిట్నీ స్పియర్స్ నేడు 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ మేరకు కాబోయే భర్త సామ్ అస్గారితో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపిన బ్రిట్నీ.. ఈ బర్త్‌డే తనకు రెండు శుభసందర్భాలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఒకటి తన తండ్రి నుంచి కన్జర్వేటర్‌షిప్ రద్దు కావడం, రెండోది తనకు కాబోయే భర్తతో మొదటిసారి బర్త్‌డే వేడుకలు చేసుకోవడమని చెప్పింది. ఇక తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న సామ్ అస్గారి.. బ్రిట్నీని ఉద్దేశిస్తూ ఒక స్వీట్ నోట్ రాశాడు. కాగా సదరు పోస్ట్‌లో తను బ్రిట్నీని భార్యగా పేర్కొనడంతో వైరల్‌గా మారింది.

‘నేను నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా ఆరాధిస్తాను కాబట్టి సింహం అనే పిలుస్తాను. నీ చిరునవ్వు నా ప్రపంచంలో వెలుగులు నింపింది. నీ పుట్టిన రోజనే కాదు, నీతో గడిపే ప్రతిరోజు నాకు వేడుకే. నా భార్యకు ఫస్ట్ బర్త్ డే విషెస్’ అంటూ బ్రిట్నీపై తన ప్రేమను చాటుకున్నాడు సామ్. ఈ పోస్ట్‌పై స్పందించిన బ్రిట్నీ.. ఇది తనకు అత్యంత సంతోషకరమైన రోజుగా పేర్కొంది. స్లంబర్ పార్టీ సాంగ్ సెట్‌లో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్న వీరిద్దరూ.. ఐదేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story