సల్మాన్ ఖాన్‌కు కొవిడ్ నెగెటివ్

by Shyam |
సల్మాన్ ఖాన్‌కు కొవిడ్ నెగెటివ్
X

శ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్ ఖాన్‌కు కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో దాదాపు 14 రోజులుగా సల్లూ భాయ్ హెల్త్ గురించి బాధపడుతున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సల్మాన్ పర్సనల్ డ్రైవర్ అశోక్‌తోపాటు ఇంట్లో పని చేసే ఇద్దరు స్టాఫ్ మెంబర్స్‌కు కరోనా పాజిటివ్ రాగా, సల్మాన్ అండ్ ఫ్యామిలీ 14 రోజులుగా ఐసొలేషన్‌లో ఉంటున్నారు.

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం సల్లూ భాయ్‌తోపాటు కుటుంబ సభ్యులకు కొవిడ్ నెగెటివ్ వచ్చిందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతుండగా… సూపర్ స్టార్ బిగ్ బాస్ సీజన్ 14 ‘వీకెండ్ కా వార్’ షూటింగ్‌కు హాజరుకానున్నారు. కరోనాతో బాధపడుతున్న స్టాఫ్ మెంబర్స్‌కు బెస్ట్ ట్రీట్‌మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు సల్లూ భాయ్. బాంబే హాస్పిటల్‌లో కొవిడ్ ట్రీట్‌మెంట్ పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సల్మాన్ ‘రాధే : ది మోస్ట్ వాంటెడ్ భాయ్‌’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో సౌత్ ఇండియన్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed