థియేటర్ ఆర్టిస్టులకు సల్మాన్ సాయం

by Shyam |
థియేటర్ ఆర్టిస్టులకు సల్మాన్ సాయం
X

లాక్‌డౌన్ టైమ్‌లో వలస కూలీలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాళ్ల కష్టాలకు చలించిన ఎంతోమంది సహృదయంతో వారికి తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో.. సల్మాన్ ఖాన్ కూడా వారికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరోసారి సల్మాన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పరేల్‌లోని దామోదర్ నాట్యగృహ, దాదర్‌లోని శ్రీ శివాజీ మందిర్ నాట్యగృహాల్లోని థియేటర్ ఆర్టిస్టుల కోసం రెండు ఫుడ్ ట్రక్కులు పంపించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ఎంతోమంది కార్మికులకు కనీసం పాదరక్షలు లేకపోవడంతో చలించిపోయిన స్వరభాస్కర్.. సల్మాన్‌కు ఫోన్ చేసి వారికి చెప్పులు ఇప్పించాలని కోరిందట.

ఈ మేరకు సల్మాన్ ఖాన్ చొరవతో రిలాక్సో సీఈఓ కార్మికులకు ఉచితంగా పాదరక్షలను పంపించారు. వాటిని స్వర భాస్కర్ స్వయంగా కార్మికులకు పంచిపెట్టారు. అంతేకాకుండా ఇటీవ‌ల‌ ముంబై పోలీసు విభాగానికి లక్ష రూపాయలైన విలువైన హ్యాండ్ శానిటైజర్లను కూడా విరాళంగా ఇచ్చారు సల్మాన్. ఇక ప‌న్వెల్ ఫామ్ హౌజ్ ప‌రిస‌రాల్లోని పేద ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాలు పంచారు. ఈద్ పండుగ సంద‌ర్బంగా ఐదు వేల కుటుంబాల‌కు పాయ‌సం కిట్స్ కూడా అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.

Advertisement

Next Story