ప్రభాస్ సర్‌ప్రైజ్.. సమ్మర్ వార్‌‌లో సలార్!

by Jakkula Samataha |
ప్రభాస్ సర్‌ప్రైజ్.. సమ్మర్ వార్‌‌లో సలార్!
X

దిశ, సినిమా : రెబల్ స్టార్‌ ప్రభాస్‌, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్‌న్యూ్స్ వచ్చేసింది. ఇటీవలే రామగుండంలో ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

2022 ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుండగా, ఇందులో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రంలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. చిత్ర రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మూవీ టీమ్.. ప్రభాస్ లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ కూడా షేర్ చేసింది. ఇందులో బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్‌ఫిట్‌ ధరించిన ప్రభాస్.. కూలింగ్ గ్లాసెస్‌తో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. కాగా ప్రభాస్ ఈ సినిమాతో పాటు ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

Advertisement

Next Story