సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి

by srinivas |
సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన శుక్రవారం ఉదయం వేంకటేశ్వరస్వామికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. తిరుచ్చిపై సన్నిధి నుంచి కళ్యాణ మండపానికి చేరుకున్న మలయప్పస్వామి సర్వాలంకారభూషితుడై సూర్యప్రభవాహనాన్ని అధిరోహించారు. సాయంత్రం స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. అంటే దివారాత్రాలకు ఆయనే అధిపతి అన్నమాట. కరోనా కారణంగా భక్తుల సందడి లేకపోయినా నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో రుమల ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story