- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను సెక్స్ వర్కర్‌నా.. దిల్ రాజుకు అలా షాకిచ్చిన హీరోయిన్
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ సాక్షి మాలిక్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాగా.. సినిమాలో అనుమతి లేకుండానే తన ఫొటోను వినియోగించారని సదరు నటి ఆరోపించింది. మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు హీరోలు కాగా.. ఒక సీన్‌లో కమర్షియల్ సెక్స్‌వర్కర్‌గా తన ఫొటో చూపించారని పేర్కొంది. కాగా దీనిపై విచారించిన కోర్టు అనుమతి లేకుండా మరొకరి ఫొటోను ఉపయోగించడం చట్టవిరుద్ధమని, సమాజంలో వారి పరువుకు నష్టం కలిగించవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. సదరు సన్నివేశాన్ని డిలీట్ చేసి, సాక్షితో పాటు తన లాయర్‌కు చూపించిన తర్వాత సినిమాను మళ్లీ ఓటీటీలో రీ-అప్‌లోడ్ చేయాలని సూచించింది. అయితే తాము ఓ ఏజెన్సీని సంప్రదించి ఆ చిత్రాన్ని తీసుకున్నామని, వారు సాక్షి నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటారనే భావించామని ప్రొడక్షన్ హౌస్ కోర్టుకు తెలిపింది.