- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇకపై రూ.10 నాణేలు అలా ఉపయోగించవచ్చు..
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజల వద్ద చెల్లనివి ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చేవి రూ.10 నాణం మాత్రమే. ఎందుకంటే.. ఏ ఒక్కరూ పది రూపాయల బిల్లలు యాక్సెప్ట్ చేయరు. నోటుకి ఉన్న విలువ నాణానికి లేకుండా పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం, ఆర్బీఐ ఎంత చెప్పినా ప్రజలు మాత్రం వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొందరైతే దుకాణదారులకు ముట్టజెప్పేస్తున్నారు. దీంతో దుకాణదారుల వద్ద, ప్రజల వద్ద భారీగా రూ.10 నాణేలు నిలువ ఉండిపోయాయి. ఇలాంటి క్రమంలోనే ఆర్టీసీలో రూ.10 నాణాలను తీసుకుంటారా? లేదా? అన్న ప్రశ్న ప్రయాణికుల్లో మొదలైంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికులు ఎలాంటి డౌట్ లేకుండా రూ.10 నాణాన్ని ఆర్టీసీ బస్సులో వినియోగించుకోవచ్చని ప్రకటించారు. టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లకు తెలియజేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులకు ఆదేశించారు. సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) December 26, 2021
- Tags
- Coins