- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్టాండుల్లో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు : సజ్జనార్
దిశ, తెలంగాణ బ్యూరో : బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్టాండ్లలోని ఖాళీ స్థలాలను పక్క షాపులను వివిధ వాణిజ్య అవసరాల కోసం అద్దె ప్రాతిపదికన టెండర్ల ద్వారా పరిమిత కాలానికి నియమ నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఇచ్చామన్నారు.
నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏ షాపులోనైనా ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించినా, నకిలీ వస్తువులు అమ్మినా, నిషేధిత వస్తువులు అమ్మినా బస్ స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, కంట్రోలర్‌కు ఫిర్యాదు చేస్తే సదరు షాపుపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉచితంగా వాడుకునే టాయిలెట్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వారికి జరిమానాలు విధించడంతో పాటు ఒప్పందం రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యేక బృందాలతో ఎంజీబీఎస్, జేబీఎస్, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, బస్సు స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి రూ. 52 వేల జరిమానా విధించడంతో పాటు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
- Tags
- bus station