ఆర్టీసీలో సజ్జనార్ మార్క్‌.. ఎంజీబీఎస్‌లో సీక్రెట్ ఆపరేషన్(వీడియో)

by Anukaran |   ( Updated:2023-10-10 15:02:01.0  )
ఆర్టీసీలో సజ్జనార్ మార్క్‌.. ఎంజీబీఎస్‌లో సీక్రెట్ ఆపరేషన్(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వైరల్ అవుతున్నాయి. ప్రజారవాణాను సురక్షితంగా, సుఖవంతంగా ప్రజలకు అందించేందుకు సజ్జనార్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో అతిపెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ అయిన మహాత్మగాంధీ బస్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సినిమాలో జరిపే సీక్రెట్ ఆపరేషన్ మాదిరిగా ఒంటరిగా బస్ స్టాండ్ అంతా తిరుగుతూ పరిశీలించారు. ఈ క్రమంలో బస్ స్టాండ్ ఆవరణలోని పరిశుభ్రత, ప్రజలకు అందుబాటులో లేని బస్సుల వివరాలను తెలుసుకున్నారు. ఎవరూ గుర్తించకుండా క్యాప్, మాస్క్ ధరించి పరిశీలించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే ఆర్టీసీ ఎండీ తెలంగాణలోనే అతిపెద్ద బస్ స్టాండ్‌గా పేరుగాంచిన ఎంజీబీఎస్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో ఆయన నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయేమోనని పలువురు అధికారులు టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story