ఇండియన్ క్రికెట్ రీసెంట్ విక్టరీపై హీరోయిన్.. బుక్

by Shyam |
ఇండియన్ క్రికెట్ రీసెంట్ విక్టరీపై హీరోయిన్.. బుక్
X

దిశ, సినిమా: ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం చారిత్రాత్మకమైనది. అజింక్య రహానే నేతృత్వంలోని ఇండియన్ టీం మెయిన్ ప్లేయర్స్ లేకుండానే మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక సంఘటన పుస్తక రూపంలో రాబోతోంది. హీరోయిన్ సైయామి ఖేర్ ఈ హిస్టారిక్ సిరీస్ గురించి పుస్తకం రాయనున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రాత్మక సిరీస్ విన్నింగ్ మూమెంట్స్‌ ఇంకా కళ్లెదుట తిరుగుతూనే ఉన్నాయన్న సైయామి ఖేర్.. క్రికెట్ అభిమానిగా, తను విట్‌నెస్‌గా నిలిచిన బెస్ట్ కమ్ బ్యాక్ స్టోరి ఇదేనని తెలిపింది. 36 పరుగులకే టీమ్ కుప్పకూలడం నుంచి 11 మంది ఫిట్ ప్లేయర్‌లను కనుగొనడం, అండర్ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న టీం గెలవడం అద్భుతమని అభిప్రాయపడింది. ఆడ్ సిట్యువేషన్స్‌లో ఇండియా విన్ అవుతుందని ఎవరూ ఊహించలేదని..యంగ్ ఇండియన్ టీం చేసి చూపించిందని చెప్పింది సైయామి.

హ్యూమన్ స్టోరీ అటాచ్ చేస్తూ ఈ చారిత్రాత్మక విజయం గురించి పుస్తకం రాయనున్నట్లు తెలిపిన హీరోయిన్.. ఇందుకోసం ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా ఉన్నానన్న సైయామీ ఖేర్..అజింక్య రహానె, రోహిత్ శర్మ, చెటేశ్వర్ పుజారా, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వంటి క్రికెటర్లు ఈ పుస్తకం కోసం తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపింది. దీంతో ఈ బుక్ కచ్చితంగా పేజీ-టర్నర్ అవుతుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed