నేచురల్ స్టార్‌తో మలార్ బ్యూటీ..

by Shyam |
నేచురల్ స్టార్‌తో మలార్ బ్యూటీ..
X

నేచురల్ హీరోయిన్ ‘సాయి పల్లవి’ మరోసారి నేచురల్ స్టార్ నానితో జతకట్టబోతుందన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని నటించబోతున్న చిత్రం.. ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా.. లీడ్ రోల్‌కు సాయి పల్లవి సెలెక్ట్ అయిందని సమాచారం. మలార్ బ్యూటీని డైరెక్టర్ ఇప్పటికే సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా ఈ ఇద్దరు నేచురల్ స్టార్స్ ఇప్పటికే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం కోసం జతకట్టి.. ఆన్ స్క్రీన్ బెస్ట్ కపుల్స్‌గా ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్తతో ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసినా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడేలా ఉంది.

కాగా నాని ఇప్పటికే ‘వి, టక్ జగదీష్’ సినిమాలు చేస్తుండగా.. ‘వి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సాయి పల్లవి విషయానికొవస్తే.. రానాతో విరాట పర్వం, నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా తన లిస్ట్‌లో చేరగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story