రానాతో పనిచేయడం అదృష్టం : సాయి పల్లవి

by Shyam |
రానాతో పనిచేయడం అదృష్టం : సాయి పల్లవి
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి.. కోస్టార్ రానా దగ్గుబాటిపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘విరాటపర్వం’లో తనతో కలిసి నటిస్తున్న మలార్ బ్యూటీ.. జెండర్ ఈక్వాలిటీ విషయంలో రానా ఆలోచనల గురించి వివరించింది. నార్మల్‌గా సినిమాలో హీరోయిన్ పాత్ర హీరో పాత్రకన్నా బలంగా ఉన్నా సరే.. టైటిల్ కార్డ్స్‌లో మాత్రం హీరో పేరే ముందుగా వేస్తారని, తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి విషయాలను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందని తెలిపింది. కానీ రానా ‘విరాటపర్వం’ టైటిల్ కార్డ్స్‌లో తనతో పాటుగా సాయిపల్లవి పేరు కూడా వేయాలని సూచించారని, లింగ సమానత్వానికి విలువనిచ్చిన అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు మహిళలకు కంటెంట్ ఉన్న రోల్స్ వస్తున్నాయని.. నయనతార, అనుష్క శెట్టి లాంటి లేడీ సూపర్ స్టార్స్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌పై నిర్మాతలకు నమ్మకం కలిగేలా చేశారన్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు ఎక్కువ మంది నిర్మాతలు ఒప్పుకునేలా ఒక కొత్త మార్గం చూపించారని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Advertisement

Next Story