అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు : సాయి పల్లవి

by Anukaran |   ( Updated:2020-07-18 03:40:51.0  )
అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు : సాయి పల్లవి
X

సహజత్వం ఉట్టిపడే నటనతోనే కాదు.. అద్దిరిపోయే స్టెప్పులతోనూ ఫిదా చేయగల టాలెంట్ మలార్ బ్యూటీ సాయి పల్లవి సొంతం. ఫిదా అంటే సాయి పల్లవి.. సాయి పల్లవి అంటే ఫిదా.. అనేంతలా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాతి సినిమాల్లోనూ గ్లామర్ డోస్ పెంచడం లాంటివి పెట్టుకోకుండా తనకు నచ్చిన పాత్రలే చేస్తూ వస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళీ భాషల్లో నటిస్తున్న బ్యూటీ.. కేవలం డబ్బుల కోసం గ్లామరస్ రోల్స్ చేయడం ఇష్టం లేదని స్పష్టం చేసింది.

పెద్ద సినిమాల్లో నటించి పెద్ద పేరు సంపాదించాలనే ఆలోచనలేమీ లేవని.. తన దగ్గరకు వచ్చిన కథల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ.. మంచి సినిమాలు చేస్తే చాలని చెప్పింది. తన కెరియర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్న అందాల భామ.. ఆడియన్స్ తన నుంచి గ్లామరస్ టచ్ కోరుకోరని తెలిపింది. తనను పెద్ద హీరోయిన్‌లా కూడా చూడరని.. తమ ఇంట్లో అమ్మాయిలా ఆదరిస్తారని అంటోంది. అందుకే చిట్టి పొట్టి దుస్తులకు దూరంగా ఉంటానని.. తనకు కంఫర్ట్ ఉంటేనే ఏ సినిమా అయినా ఒప్పుకుంటానని తెలిపింది. అంతేకానీ.. సినిమా పెద్దదా, చిన్నదా అనే ఆలోచన చేయయని చెప్పింది. పాత్ర నచ్చి.. తన కండిషన్స్‌కు ఓకే చెప్తేనే సినిమాకు సైన్ చేస్తానని చెప్తోంది మలార్ గర్ల్.

ప్రస్తుతం తెలుగులో రానాకు జోడీగా విరాటపర్వంలో నటిస్తున్న సాయి పల్లవి.. ఈ సినిమాలో ప్రజల్లో విప్లవాగ్ని రాజేసే ఉద్యమకారిణిగా కనిపిస్తుందని సమాచారం. మరో వైపు లవ్ స్టోరీలో నాగచైతన్య లవర్‌గా అలరించేందుకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story