- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిడ్-19 జీవితకాలం… ఏ పదార్థం మీద ఎంతసేపు?
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి అధ్యాపక వర్గాలు పరిశోధనలో పడ్డారు. అన్ని కోణాల్లో ఈ వైరస్ గురించి తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. ఒక్కొక్కరు విడివిడిగా ఎవరికి వారే పరిశోధనలు చేయకుండా అందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ పరిశోధనల్లో సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణంగా అందరూ ఉపయోగించే వస్తువుల మీద కోవిడ్-19 వైరస్ ఎంతసేపు జీవించి ఉండగలుగుతుందనే విషయం గురించి అమెరికా ప్రభుత్వం యూసీఎల్ఏ, ప్రిన్స్‌టన్ వంటి యూనివర్సిటీల భాగస్వామ్యంతో పరిశోధనలు చేస్తోంది.
ఈ పరిశోధనలో భాగంగా నాలుగు పదార్థాలను శాస్త్రవేత్తలు పరిగణనలోనికి తీసుకున్నారు. ఒకటి గాలి… దీని ద్వారానే తుమ్ము, దగ్గులోని తుంపరలు ప్రయాణిస్తాయి. రెండు రాగి… యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గల పదార్థం. మూడు చెక్కబోర్డు… సాధారణంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్లు డెలివరీ చేసే పదార్థం. నాలుగు ప్లాస్టిక్… సాధారణంగా ప్రతి ఇంట్లో ఎక్కువగా కనిపించే పదార్థం. ఈ నాలుగింటి మీద కరోనా వైరస్ ఎంతసేపు బతికి ఉండగలదని శాస్త్రవేత్తలు తమ అధ్యయన నివేదిక పంపించారు.
ఈ నివేదికలో కోవిడ్ 19 వైరస్ గాలిలో దాదాపు మూడు గంటల వరకు బతికి ఉంటుందని, రాగి పాత్రల మీద దాదాపు నాలుగు గంటల వరకు, అలాగే చెక్కబోర్డు మీద కనీసం 24 గంటలపాటు, ఇక ప్లాస్టిక్ వస్తువుల మీద రెండు నుంచి మూడు రోజుల వరకు క్రియాశీలకంగా ఉంటుందని నివేదికలో వెల్లడించారు. ఆయా వస్తువులను డిసిన్ఫెక్టెంట్‌తో శుభ్రం చేయడం ద్వారా వైరస్‌ను తొలగించవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. అంతేకాకుండా రాగి పాత్రల్లో కరోనా వైరస్ చనిపోతుందని వస్తున్న వార్తలను వారు కొట్టిపారేశారు.
Tags : covid-19, coronavirus in india, coronavirus symptoms, coronavirus what to eat,