- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5న జరిగే సడక్ బంద్‌ను విజయవంతం చేయండి : టీజేఏస్
దిశ, గుండాల : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ఈ నెల 5న జరిగే సడక్ బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం గుండాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్ నుండి అశ్వారావుపేట దాకా హరితహారం పేరుతో పోడు భూములు లాక్కొన్నారని ఆరోపించారు.
అటవీ ప్రాంతంలో కందకాలు ఏర్పాటు చేయడం బలవంతంగా భూములు లాక్కోవడం జరుగుతుందని, అటవీశాఖ అధికారులు ఎన్నడూ లేని విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తానని.. మూడు సంవత్సరాలు గడిచినా పోడు భూములకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోడు భూముల హక్కుల సాధన కోసం జరిగే సడక్ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని సడక్ బంద్ విజయవంతం చేయాలని కోరారు. పోడు భూముల హక్కుల పత్రాలు సాధించుకునే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీజేఏసీ నాయకులు గొల్లపల్లి రమేష్, నునవత్తు రవి నాయక్, గడ్డం రాములు, భద్రం, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- khammma