కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చేరాను : సచిన్

by Shyam |
కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చేరాను : సచిన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఆస్పత్రిలో చేశాడు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రగా, వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్టు సచిన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అంతేగాకుండా.. ‘నేను త్వరగా కోలుకోవాలని మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యుల సూచనల మేరకు నేను కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రపంచకప్ గెలుచుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులందరికీ, నా టీమ్‌మేట్స్‌కు అభినందనలు’ అని సచిన్ తెలిపారు.

Advertisement

Next Story