హైకోర్టును ఆశ్రయించిన సచిన్ పైలట్ బృందం

by Shamantha N |
హైకోర్టును ఆశ్రయించిన సచిన్ పైలట్ బృందం
X

జైపూర్: రాజస్థాన్ రాజకీయ వివాదం కోర్టుకు చేరింది. స్పీకర్ నోటీసులపై మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోహత్గిని అటార్నీ జనరల్‌గా నియమించిన విషయం విదితమే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ సీపీ జోషిని బుధవారం కోరింది. ఈ విషయమై తన ముందు హాజరై శుక్రవారం వివరణ ఇవ్వాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అండదండలు ఉన్న ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున వాఖాలత్ తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింగ్విని రంగంలోకి దించింది.

Advertisement

Next Story

Most Viewed