ఒంటరి మహిళ అకౌంట్‌లో రైతుబీమా డబ్బులు మాయం.. ఏం జరిగిందంటే..?

by Sumithra |
ఒంటరి మహిళ అకౌంట్‌లో రైతుబీమా డబ్బులు మాయం.. ఏం జరిగిందంటే..?
X

దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన ఓ అనాథ మహిళకు చెందిన రూ 3.50 లక్షలు కొట్టేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు పద్మ భర్త రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి రెండు సంవత్సరాల కుమారుడితో ఆమె ఒంటరిగా ఉంటోంది. భర్త చనిపోవడంతో రైతుబీమా కింద వచ్చిన రూ. 5 లక్షలు బ్యాంక్‎లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. ఈ క్రమంలో దూరపు బంధువు మహేందర్ కన్ను ఆ డబ్బుపై పడింది. బ్యాంక్ మేనేజర్‌తో సన్నిహితంగా ఉండే వ్యక్తితో కుమ్మకై పథకం ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సదరు వ్యక్తి ఖాతాలోకి రూ.3,50000 బదిలీ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు పద్మ గ్రామ సర్పంచ్‌ని సంప్రదించగా అతను మహేందర్‌ను వివరణ కోరాడు. తనకు ఏమీ తెలియదని సమాధానం చెప్పడంతో గ్రామస్తులతో కలిసి నిందితులను బంధించి చిట్యాల పోలీసులకు అప్పగించారు. సర్పంచ్ చేసిన పనికి గ్రామస్తులు అభినందనలు తెలియచేస్తూ.. బ్యాంక్ మేనేజర్‌తో పాటు నిందితులను శిక్షించి.. పద్మ నగదును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed