'Rx 100' హీరో కార్తికేయ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటో వైరల్

by Shyam |   ( Updated:2021-08-23 00:37:15.0  )
Rx 100 హీరో కార్తికేయ సీక్రెట్  ఎంగేజ్‌మెంట్‌.. ఫోటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ లో భారీ హిట్ ని అందుకున్న కార్తికేయ నిశ్చితార్ధం సీక్రెట్ గా జరిగింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది. ఒక పారిశ్రామికవేత్త కుమార్తెను కార్తికేయ వివాహమాడుతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహంగా తెలుస్తోంది. వివాహ తేదీ, కార్తికేయకు కాబోయే భార్య గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఎంగేజ్‌మెంట్‌ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పలువురు ప్రముఖులు కార్తికేయకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇంత సడెన్ గా ఈ హీరో నిశ్చితార్ధం ఏంటి..? ఎవరికి చెప్పకుండా ఇంత సీక్రెట్ గా చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా సినిమా కోసమా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ ఫొటోలో కార్తికేయ బంధువులు కూడా ఉండడంతో నిజంగానే ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకుంటున్నట్లు అర్ధం అవుతుంది. కరోనా కారణంగా ఎవరిని పిలవలేక.. ఇలా చేసి ఉండొచ్చు అని నెటిజన్లు భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం కార్తికేయ ‘రాజా విక్రమార్క’ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

Next Story