రెస్టారెంట్స్‌లో యాక్సెస్‌కు క్యూఆర్ కోడ్ టాటూస్

by Shyam |
Food-delivery
X

దిశ, ఫీచర్స్ : డిజిటల్ యుగంలో మనీ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇండియాలో అయితే డీమానిటైజేషన్ తర్వాత టీస్టాల్స్‌, పాన్ షాప్స్‌లో సైతం క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేసి యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు రష్యాకు చెందిన ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘డెలివరీ క్లబ్’.. క్యూఆర్ కోడ్స్‌కు సంబంధించి టెంపరరీ టాటూస్(పచ్చబొట్లు) రిలీజ్ చేసింది. ఈ మేరకు మాస్కోలోని బార్లు, రెస్టారెంట్లలోకి నగరవాసులను అనుమతించడంతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వారిని ఎంకరేజ్ చేసేవిధంగా వీటిని ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం మాస్కోవాసులు.. కేఫ్స్, బార్లలో కూర్చోవాలంటే తాము వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా తెలిపే క్యూఆర్ కోడ్ చూపించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆగస్టు 1 వరకు అవుట్‌డోర్ టెర్రస్‌లపై కూర్చునేందుకే పర్మిషన్ ఉంది. కాగా రష్యాలో బుధవారం 786 కరోనా వైరస్ సంబంధిత మరణాలు సంభవించినట్టు కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ నివేదికలో గవర్నమెంట్ ప్రస్తావించింది. పాండమిక్ మొదలైనప్పటి నుంచి అక్కడ ఒకే రోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ‘ఎవర్నిక్ టాటూ’ అనే టాటూ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తున్న ‘డెలివరీ క్లబ్’.. బార్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లకు ఈ ప్రయత్నం బూస్టప్ ఇవ్వగలదని, అంతేకాదు వ్యాక్సిన్ ప్రాధాన్యతను జనాలకు గుర్తుచేస్తుందని తెలిపారు.

ఆరు రకాల డిజైన్లు..

ఒంటిపై రెండు వారాల వరకు ఉండగలిగే ఈ టెంపరరీ టాటూస్‌(వాటర్ రెసిస్టెంట్)లో మొత్తం ఆరు రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నట్టు డెలివరీ క్లబ్ సంస్థ తెలిపింది. వీటి ద్వారా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని తగ్గించాలని కోరుకుంటున్నామని, అలాగే సిటీ ఇన్‌స్టిట్యూషన్స్‌లో QR కోడ్‌లను ప్రదర్శించే విధానాన్ని మరింత వైవిధ్యంగా, ఆసక్తికరంగా మార్చాలనుకుంటున్నామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed