‘గ్రామీణ డిమాండ్ ప్రత్యామ్నాయం కాదు’

by  |
‘గ్రామీణ డిమాండ్ ప్రత్యామ్నాయం కాదు’
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ డిమాండ్ (Rural demand) ఆర్థిక వ్యవస్థ (Economy) కోలుకోవడానికి దోహదం చేస్తుంది కానీ పట్టణ డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఉండదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (India Ratings and Research) నివేదిక తెలిపింది. కొవిడ్-19 వల్ల ఏర్పడ్డ ప్రతికూల ప్రభావం నుంచి పారిశ్రామిక, సేవల రంగాలు ఇంకా కోలుకునేందుకు కష్టపడుతుండగా, వ్యవసాయ రంగం ఆర్థిక పునరుద్ధరణకు ఇంజిన్‌గా మారగలదని నివేదిక పేర్కొంది.

దేశ స్థూల (Country Gross) విలువలో వ్యవసాయం వాటా సుమారు 17 శాతం ఉన్నందున, గ్రామీణ డిమాండ్ (Rural demand) వినియోగ డిమాండ్‌ (Consumption demand)కు మద్దతునిస్తుంది. కానీ, పట్టణ డిమాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఉండదని రేటింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ (GDP) వృద్ధి ప్రతికూలంగా 17.03 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

లాక్‌డౌన్ కాలంలో, ఆ తర్వాత కరోనా ప్రభావం పడని రంగం వ్యవసాయం (Agriculture) ఒక్కటే. 2020-21లో వ్యవసాయ రంగం ఏడాదికి 3.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆశిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. అధిక వ్యవసాయ ఉత్పాదక స్థాయిల కారణంగా వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేసే వ్యవసాయ వస్తువుల ధరలు తక్కువగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. వ్యవసాయ ఉత్పత్తితో పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిన చాలామంది ఫ్యాక్టరీ కార్మికులు గ్రామీణ డిమాండ్‌ను పెంచేందుకు దోహదపడ్డారని నివేదిక తెలిపింది.


Next Story

Most Viewed