వ్యవస్థను గుడ్డిగా అవమానించడం మంచిది కాదు- Supreme Court

by Shamantha N |   ( Updated:2024-04-26 07:10:00.0  )
వ్యవస్థను గుడ్డిగా అవమానించడం మంచిది కాదు- Supreme Court
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈవీఎం-వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ కేసులో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో వందశాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్ ను తిరస్కరించింది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో కూడిన రెండు వేర్వేరు తీర్పులు వెలువరించింది.

ఈకేసులో వీటిపై గత మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. చివరకు ఆ పిటిషన్లు కొట్టేస్తున్నట్లు సుప్రీం బెంచ్‌ తెలిపింది. వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యం అని పేర్కొంది. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. అందుకే, అర్థవంతమైన విమర్శలు చేయాలని.. అది న్యాయ వ్యవస్థ అయినా సరే చట్ట సభలు అయినా సరే నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం అని పేర్కొంది. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు తీర్పు చెప్పింది.

ఈ కేసు సందర్భంగా ప్రొటోకాల్‌లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘం నుంచి సమగ్ర వివరణ తీసుకుంది కోర్టు. తర్వాత తీర్పుని రిజర్వ్ చేసిన కోర్టు.. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లకు కొట్టివేసింది. అదే క్రమంలో ఈసీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈవీఎంలో సింబర్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆ యూనిట్ ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజులు భద్రపరచాలని సూచించింది. ఎన్నికల ఫలితాలు వచ్చా.. ఏడు రోజుల్లోగా అభ్యర్థులు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది. ఆ టైంలో మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన తొలి మెమోరీని చెక్ చేయాలని సూచించింది. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే... ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.

ప్రస్తుతం ఒక నియోజకవర్గంలోని ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది అంత ఈసీ కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.

Advertisement

Next Story