- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Andhra University: ఏయూకు షాక్ ఇచ్చిన జేసీ.. 'అచీవర్స్ డే రద్దు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అధికార పార్టీకి మేలు చేసేందుకు ఎన్నికల సమయంలో తలపెట్టిన 'అచీవర్స్ డే'కు జాయింట్ కలెక్టర్ అశోక్ అడ్డుకట్ట వేశారు. ఏయూలో పలువురు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రాగా వారితో పాటు వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తం 1,400 మందితో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం 'అచీవ ర్స్ డే'ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల సమయంలో ఇలా ఓటు హక్కు కలిగిన వారిని పెద్ద సంఖ్యలో సమావేశపరిచి, ప్రభుత్వ అధికారులు ప్రసంగాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా సరే ఏయూ పెద్దలు దీనికి నడుం కట్టారు. దీనిపై విమర్శలు రాగా, తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఎన్నికల అధికారులు కార్యక్రమం మొత్తం నిఘా కెమెరాలతో చిత్రీకరిస్తారని, తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని యూనివర్సిటీ యాజమాన్యం ఖండించారు.
పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమమే నిర్వహించాలని యత్నించి, ఎన్నికల సంఘం ఆదేశాలతో విరమించుకున్నారని, ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నలు రావడం, వార్తలు రావడంతో జేసీ జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని రద్దు చేయించారు.