Samantha : పెళ్లి డ్రెస్‌లో సమంత.. చైతూ జ్ఞాపకం తొలిగించినట్లేనా?

by Jakkula Samataha |   ( Updated:2024-04-26 11:28:13.0  )
Samantha : పెళ్లి డ్రెస్‌లో సమంత.. చైతూ జ్ఞాపకం తొలిగించినట్లేనా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

అసలు విషయంలోకి వెళ్లితే.. టాలీవుడ్ లవ్‌లీ కపుల్‌గా మంచి పేరు సంపాదించుకున్న జంట నాగచైతన్య, సమంత. వీరు ప్రేమించి పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సమంతలో చాలా చేజ్ వచ్చిందనే చెప్పవచ్చు. తన ప్రేమ, పెళ్లి లాంటి జ్ఞాపకాలను ఒకొక్కటిగా తొలిగిస్తూ వస్తుంది. టాటూ తొలిగించింది, ఇన్ స్టాలో ఫొటోస్ కూడా డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లిలో ధరించిన తెల్లటి గౌనును నల్లటి మోడ్రన్ డ్రెస్‌గా మార్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సామ్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.ఇక పై నేను ధృఢంగా ఉండటం మర్చిపోలేనేమో..నాకు ఎంతో ఇష్టమైన నా పెళ్లి గౌనును రీమోడలింగ్ చేయించాను. దీనిని ఇంత అందంగా మార్చిన క్రేశాబజాజ్‌కు థాక్స్.నా అలవాట్లను మార్చుకోవడం.. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్ గా నన్ను ఎంపిక చేసినవారికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ సమంత మెల్లి మెల్లిగా చైతూ జ్ఞాపకాలను తొలిగిస్తూ వస్తుంది అంటున్నారు.

Advertisement

Next Story