Faria Abdullah : అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. అతనిలో అదొక్కటి ఉంటే చాలు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2024-04-26 11:28:32.0  )
Faria Abdullah : అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా.. అతనిలో అదొక్కటి ఉంటే చాలు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : ఆమె పేరు వింటే చాలు సినీ లవర్స్ ముఖంపై చిరునవ్వులు విరబూస్తాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె మరెవరో కాదు. జాతి రత్నాలు మూవీలో ‘చిట్టి’ పాత్రకు ప్రాణం పోయడంతో పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫేమస్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. 2021లో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించినా మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ జాతి రత్నాలు మూవీతో ఒక్కసారిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఆరు అడగులు ఎత్తు కలిగిన ఫరియా నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక ఈమె బెల్లీ డ్యాన్స్‌కు అయితే అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో మరోసారి మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఫరియా. కామెడీ అండ్ ఎంటర్టనైన్మెంట్ పాత్రలో ఫరియా చక్కగా ఒదిగిపోతుందని, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికీ ఇండస్ట్రీలో టాక్ సొంతం చేసుకున్న ఫరియా అబ్దుల్లా ఈ మూవీతో తప్పక సక్సెస్ అవుతుందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దులా తన పెళ్లికి సంబంధించిన ప్రస్తావన రాగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. తాను చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ‘‘నేను ఆరడుగుల ఎత్తు ఉంటాను. ఇక నాకు కాబోయే భర్త నాకంటే హైట్ తక్కువున్నా పర్లేదు కానీ అతనిలో హాస్య చతురత మాత్రం ఉండాలి’’ అంటూ మనసులోని మాట బయట పెట్టింది. తాను లైఫ్‌లో చాలా బాధలు అనుభవించానని, కనీసం రాబోయే భర్త ఫన్‌గా ఉంటే సంతోషంగా ఉంటానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు, ప్రేక్షకులు ‘యు ఆర్ గ్రేట్’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed