బలహీనపడ్డ రూపాయి!

by Harish |
బలహీనపడ్డ రూపాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: డాలరు మారకంతో దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ పతమైంది. ఆరంభంలో బలపడిన తర్వాత మళ్లీ బలహీనపడి రూ. 76.47 వరకూ వెళ్లింది. చివరికి 40 పైసలు క్షీణించి రూ. 76.46 వద్ద స్థిరపడింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్‌లో 6 డెట్ ఫండ్ పథకాలను అకస్మాత్తుగా నిలిపేయడంతో మూలధన ప్రభావం కష్టమనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో మొదలైంది. దీనికితోడు, కరోనా వైరస్‌కు యాంటీవైరల్ డ్రగ్ విఫలమైన వార్తలతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీనపడినట్టు ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం దేశీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపించడంతో రూపాయి బలహీన పడుతున్నట్టు ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కరెన్సీ హెడ్ రాహు అభిప్రాయపడ్డారు. ఔషధాలను అభివృద్ధి చేయడంలో సందేహాలు ఉండటంతో మార్కెట్లలో సెంటిమెంట్ దెబ్బతిందని, దీంతో ఫారెక్స్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైందని చెప్పారు.

Tags: Dollar vs rupee, rupee, 40 paise against dollar, FPI outflow concerns

Advertisement

Next Story

Most Viewed