- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్ సునీత బాటలో సురేఖ వాణి..సెకండ్ మ్యారేజ్‌కి రెడీ!
దిశ, సినిమా : విభేదాల కారణంగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న సింగర్ సునీత..ఇటీవల రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో సెలబ్రిటీ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి..చాలా సినిమాల్లో బ్రహ్మానందం భార్యగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే 2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించగా..అప్పటి నుంచి కూతురు సుప్రీతతో కలిసి ఉంటుంది.
భర్త మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన తన తల్లికి రెండో పెళ్లి చేయాలని సురేఖ వాణి కూతురు సుప్రీత నిర్ణయించుకుందట. సింగర్ సునీత బాటలో నడవాలని తల్లికి సూచించిందని తెలుస్తోంది. తానే దగ్గరుండి పెళ్లి చేస్తానని తల్లి ఎదుట మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సురేఖ లేదా ఆమె కూతురు అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.