విమానాల్లో భారత్‌కు వచ్చేవారికి నిబంధనలు

by Shamantha N |
విమానాల్లో భారత్‌కు వచ్చేవారికి నిబంధనలు
X

న్యూఢిల్లీ: యూరప్, ఇతర దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో విదేశాల నుంచి భారత్‌కు వస్తున్నవారు పాటించాల్సిన నిబంధనలను కేంద్ర పౌర విమానయన శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం, కరోనా లక్షణాలు లేనివారికే దేశంలోకి అనుమతి ఉంది. విమానంలోనూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శుచీ శుభ్రత పాటించడం అత్యవసరం. ప్రయాణికులందరూ ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. భారత్‌లో అడుగుపెట్టగానే సంబంధిత ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడాలి. పదేళ్లలోపు పిల్లలు హోం క్వారంటైన్‌లో ఉండొచ్చు.

ఈ క్వారంటైన్‌ నుంచి మినహాయింపుకోరే వాళ్లు ప్రయాణానికి మూడు రోజులలోపు ఆర్టీ పీసీఆర్ టెస్టులో కరోనా నెగెటివ్ రిపోర్టును అప్‌లోడ్ చేయాలి. లేదంటే భారత్‌లోని ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టు చేసుకోవాలి. విదేశస్తులు వారంపాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు, మరో వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. విమానయానానికి మూడు రోజుల(72 గంటల) ముందు వీటికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వెబ్‌సైట్‌లో సమర్పించాలి. లేదా ఇక్కడికి చేరగానే సంబంధి హెల్త్ కౌంటర్‌లో నేరుగా అందజేయాలి.

Advertisement

Next Story