- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని వలన చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యా – నటి
దిశ, సినిమా: నటి రుబీనా దిలాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫ్-లవ్‌పై మెసేజ్ షేర్ చేసింది. కొవిడ్-19 నుంచి రికవరీ అయ్యాక తను ఏవిధంగా బరువు పెరిగిందో తెలిపిన నటి.. దీనివల్ల చాలా ‘అన్‌కంఫర్టబుల్’గా ఫీల్ అవడంతో పాటు కాన్ఫిడెన్స్ కోల్పోయానని చెప్పింది. కానీ ఆ తర్వాత ‘నాజూకైన శరీరం’ కన్నా విలువైనవి లైఫ్‌లో చాలా ఉన్నాయని రియలైజ్ అయ్యానని, అప్పటి నుంచి తనని తాను ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నానని తెలిపింది. ఈ క్రమంలో ఆఫ్-షోల్డర్ గౌనులో ఉన్న పిక్చర్స్ పోస్టు చేసిన రుబీనా.. ‘పర్ఫెక్ట్ జీరో సైజు బాడీ మాత్రమే మనల్ని నిర్వచించదని తెలుసుకున్న తర్వాత నన్ను నేను ఇష్టపడటం నేర్చుకుంటున్నా. కొవిడ్ తర్వాత 7 కేజీల బరువు పెరగడంతో నిజంగా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యా. మళ్లీ నా రెగ్యులర్ వెయిట్ 50 కేజీలకు చేరుకునేందుకు చాలా కష్టపడ్డా’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు బరువు అనేది మనకు ఆరోగ్యాన్నిచ్చేదే తప్ప, రూపం కోసం కాదని అభిమానులకు సూచించింది.
ఇక ఈ పోస్టుపై స్పందించిన ఆమె భర్త అభినవ్ శుక్లా.. ‘ఓకే మేడమ్, నేను పరోటాలు తినడం వల్ల 7 కిలోలు పెరిగాను’ అని రిప్లయ్ ఇచ్చాడు. కాగా రుబీనా, అభినవ్ బిగ్ బాస్ 14లో కంటెస్టెంట్లుగా కనిపించిన విషయం తెలిసిందే.