శిథిలాల్లో చిక్కుకున్న వారిని కనిపెట్టే రాడార్

by Harish |
శిథిలాల్లో చిక్కుకున్న వారిని కనిపెట్టే రాడార్
X

దిశ, వెబ్‌డెస్క్: భూకంపాలు, కొండ చరియలు విరిగిపోవడం లేదా భవనాలు కూలిపోవడం వంటి విపత్తులు సంభవించినప్పుడు ఆ శిథిలాల్లో చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడటం అనేది వారిని ఎంత త్వరగా వెతికిపట్టుకున్నారనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. వారిని ఎంత త్వరగా కనిపెట్టగలిగితే అంత త్వరగా వారిని కాపాడవచ్చు. అంటే ప్రతి నిమిషం ప్రాణాలతో చెలగాటం అన్నమాటే. అయితే అలా చిక్కుకున్న వారిని కనిపెట్టడానికి ఇప్పటికే కొన్ని రాడార్లు ఉన్నాయి. అయితే అవి 10 నుంచి 20 మీటర్ల పరిధిలోనే కనిపిస్తాయి. పెద్ద ఎత్తున భూకంపాలు వచ్చినపుడు ఇలాంటి రాడార్లు ఏ మాత్రం పనిచేయవు. అందుకే జర్మనీకి చెందిన ‘ఫ్రాన్‌హోఫర్ ఇనిస్టిట్యూట్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఫిజిక్స్, రాడార్ టెక్నిక్స్’ వారు ఒక కొత్త రాడార్‌ను కనిపెట్టారు.

శిథిలాల కింద చిక్కుకుని ఉన్న బాధితుల శ్వాసను, హృదయ స్పందనలను గుర్తించడం ద్వారా ఈ రాడార్ పనిచేస్తుంది. అంతేకాకుండా హృదయ స్పందన రీడింగుల ద్వారా ఎవరిని త్వరగా కాపాడాలి? ఎవరిని కాపాడటానికి ఎంత సమయం ఉంది? అనే డేటాను కూడా చూపించి రెస్క్యూ సిబ్బందికి స్పష్టతనిస్తుంది. త్వరలో ఇదే రాడార్‌ను డ్రోన్‌కు తగిలించి, సంఘటన స్థలం వద్ద తిప్పుతూ ప్రమాదంలో ఉన్న వారందరిన్నీ గుర్తించి, వారిని సమయం మించిపోయేలోపు కాపాడే దిశగా ఈ రాడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫ్రాన్‌హోఫర్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed