- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC అధికారులు చేసే పనికి.. లబోదిబోమంటున్న ప్రయాణికులు
దిశ, చెన్నూర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ డిపోకు అత్యధికంగా రాబడి ఉన్నా ప్రాంతాలు చెన్నూరు, చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఆర్టీసీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తుంది. గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అప్పటికీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
ప్రస్తుత కరోనా సమయంలో కూడా ఎటువంటి నియమాలు పాటించకుండా, ప్రయాణికులు కెపాసిటీకి మించి నిలుచొని రావడం ఈ ప్రాంత ప్రజలకు అలవాటు అయిపోయింది. చెన్నూరు లో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు హామీలు కురిపించిన రాజకీయ నాయకులు ఇలాంటి సమయంలో పంట్టించుకోక పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు డిపో అందని ద్రాక్షగా మిగిలిన ప్పటికీ కనీసం బస్సులు సరైన సమయంలో నడిచే విధంగా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవ తీసుకొని ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రయాణికుల కష్టాలు దూరం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.