- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల కీలక భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసుల వివాదం కొలిక్కి వచ్చింది. తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలిపింది. 1.61 లక్షల కిలోమీటర్ల మేరకు ఇరు రాష్ట్రాలు బస్సులు నడిపే విధంగా ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు రాష్ట్రాలు సోమవారం ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో ఒప్పంద పత్రాలు తీసుకోనున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలు ఒప్పంద పత్రాలు మార్చుకోనున్నారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 22నుంచి రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులకు బ్రేక్ పడగా సెప్టెంబర్ 28నుంచి గ్రేటర్‌తో పాటుగా రాష్ట్రమంతా, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సర్వీసులు మొదలయ్యాయి. కానీ ఏపీకి మాత్రం మొదలుకాలేదు. తెలంగాణ భూభాగంలో ఏపీ ఎక్కువ కిలోమీటర్లు బస్సు సర్వీసులు నడుపుతుందని, రెండు రాష్ట్రాలు సమానంగా ఆర్టీసీ సర్వీసులు తిప్పాలని తెలంగాణ ప్రతిపాదించింది. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య నాలుగు విడుతలుగా చర్చలు జరిగాయి. కానీ కొలిక్కి రాలేదు. దీంతో దసరా పండుగకు కూడా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుపలేదు. కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది. అయితే రెండు రాష్ట్రాల మధ్య కిలోమీటర్ల ప్రాతిపదికన ఒప్పందం కుదరడంతో అంతరాష్ట్ర బస్సు సర్వీసుల అంశం కొలిక్కి వచ్చింది.