- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యుత్ స్తంభం ఎక్కిన ఆర్టీసీ కండక్టర్
దిశ, హూస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని నెహ్రూ మసీదు వద్ద తాగిన మైకంలో బాలు అనే వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి కాసేపు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కిన వ్యక్తి ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తాడని స్థానికులు తెలిపారు. దీనికన్నా ముందు తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లిన అత్తపై దాడి చేసి భార్యను కొట్టి నెహ్రూ మసీదు దగ్గర శివాజీ నగర్ రోడ్డు వద్ద గల విద్యుత్ స్తంభం ఎక్కి చనిపోతానని బెదిరించాడు. గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు విద్యుత్ స్తంబం ఎక్కిన ఆర్టీసీ కండక్టర్ బాలును సముదాయించి కిందికి దించడంతో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ కండక్టర్ బాలు తరచూ తాగుతూ భార్యను కొడుతూ ఉంటాడని స్థానికులు తెలిపారు. విద్యుత్ స్తంభం ఎక్కిన బాలును, అతని భార్య, అత్తను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మొత్తానికి ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.