వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు.. టెన్షన్‌లో స్థానికులు

by Anukaran |   ( Updated:2021-08-30 23:24:45.0  )
వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు.. టెన్షన్‌లో స్థానికులు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని పలు జిల్లాలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద లోయర్ మానేరు వాగుకు వరద ఉధృతి పెరగింది. ఆ వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకొని కొట్టుక పోయింది.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు మానేరు వాగు వంతెనపై సోమవారం రోజు చిక్కుకోగా.. అందులో దాదాపు 30 మంది ప్రయాణికులున్నారు. వరద ఉధృతి గమనించని డ్రైవర్ బస్సును బ్రిడ్జిమీదకు తీసుకెళ్లడంతో బస్సు అక్కడే చిక్కుకపోయింది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ బ‌స్సును జేసీబీ స‌హాయంతో బ‌య‌ట‌కు తీసేందుకు ప్రయ‌త్నించిన‌ప్పటికీ విఫ‌ల‌మైంది. అయితే మంగళవారం వరద ఉధృతి ఎక్కువ కావడంతో బ్రిడ్జి చివరన చిక్కుకున్న ఆర్టీసీ బస్సు నీటి ప్రవాహానికి కొట్టుక పోయింది. దీంతో సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Advertisement

Next Story