ఏపీలో విషాదం.. డ్రైవర్‌కు గుండెపోటు.. ఆర్టీసీ బస్సు బోల్తా

by Anukaran |   ( Updated:2021-08-15 03:23:39.0  )
ఏపీలో విషాదం.. డ్రైవర్‌కు గుండెపోటు.. ఆర్టీసీ బస్సు బోల్తా
X

దిశ, ఏపీ బ్యూరో: డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆర్‌టీసీ బస్సు బొల్తాపడ్డ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి తిరుపతికి వస్తుండగా శనివారం అర్థరాత్రి భాకరాపేట ఘాట్‌ రోడ్డులోకి రాగానే బస్సు డ్రైవర్‌ గంగాధరంకు గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గంగాధరంకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story