ప్రైవేట్ ట్రావెల్స్‎పై ఆర్టీఏ దాడులు

by srinivas |
ప్రైవేట్ ట్రావెల్స్‎పై ఆర్టీఏ దాడులు
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. విజయవాడలో సోమవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. పర్మిట్లు లేకుండా తిరుగుతున్న మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలంటే ఆల్ ఇండియా పర్మిట్, టెంపరరీ పర్మిట్ తప్పనిసరి అని డీటీసీ పురేంద్ర స్పష్టం చేశారు. మరోవైపు కరోనా నిబంధనలకు లోబడి బస్సులు నడపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పురేంద్ర హెచ్చరించారు.

Advertisement

Next Story