ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. 12 గంటల బంద్‌కు పిలుపు

by Sumithra |
ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. 12 గంటల బంద్‌కు పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలోని అలప్పుజలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి అలప్పుజ జిల్లాలో ఆర్ఎస్ఎస్, ఎస్‌డీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాహుల్ కృష్ణ అలియాస్ నందు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆరుగురు ఎస్‌డీపీఐ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది ఎస్‌డీపీఐ కార్యకర్తలతో పలువురిని అరెస్ట్ చేశారు. అలప్పుజలో 12 గంటల బంద్‌కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story