- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: RS ప్రవీణ్ కుమార్
ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి: RS ప్రవీణ్ కుమార్
X
దిశ, చిట్యాల: పేద రైతుల పొట్ట కొట్టే ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, పిట్టంపల్లి గ్రామ రైతులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. కేవలం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం రెక్కాడితే గాని డొక్కాడని 400 మంది పేద రైతుల భూములు గుంజుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకున్న వ్యవసాయ భూమిలో వరి, పత్తి పండుతుందని, అదే ఆధారంగా జీవిస్తున్నామని, భూమిని కోల్పోతే తమకు చావే దిక్కని కన్నీటి పర్యంతమయ్యారు.
Advertisement
- Tags
- chityala
Next Story