- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిట్టా బాలకృష్ణారెడ్డితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డితో బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి అని పేర్కొన్నారు. రాజకీయంగా మోసానికి, దగాకు గురైన వ్యక్తి అని, అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులతో సహా అన్ని కులాలు వర్గాలు మహిళలు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కొరకు పోరాడటమే లక్ష్యంగా దాదాపు ఒకే భావజాలంతో ఏర్పడిన బహుజన్ సమాజ్ పార్టీ, యువ తెలంగాణ పార్టీ కలిసి పని చేస్తే లక్ష్యం చేరుకోవడం సులభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ లక్ష్యంతోనే తెలంగాణ పార్టీ అధ్యక్షుడుతో భేటీ అయినట్లు తెలిపారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ సాధనకు ముందు… తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలపై ఉద్యమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించినా ఉపయోగం లేకుండా పోతుందని ఆరోపించారు. 80 శాతం లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం పోరాటం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 4 జనరల్ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పి నేటి వరకు ఒక ఆసుపత్రి కూడా దుయ్యబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్ని వర్గాలతో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు జిట్టా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జనరల్ సెక్రటరీ రాణిరుద్రమదేవి, నాయకుడు సైదులు తదితరులు పాల్గొన్నారు.